బాలయ్య కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. వేడుకలో ఈ ఆసక్తికర ఘటనకు.!
Sat Jun 14, 2025 11:48 Entertainment
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నటి సంయుక్త మీనన్‌తో కలిసి ఏలూరు నగరంలో సందడి చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక నగల దుకాణాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఏలూరులో జరిగిన నగల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ, తన రాబోయే చిత్రం ‘అఖండ 2’ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా నిర్మాణం పూర్తయిందని, చాలా బాగా వచ్చిందని ఆయన తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నటి సంయుక్త మీనన్, బాలయ్య పట్ల గౌరవపూర్వకంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలకృష్ణ ఇతరులతో మాట్లాడుతుండగా.. సంయుక్త వెనుక నుంచి వచ్చి ఆయన కాళ్లు మొక్కారు. ఈ అనూహ్య పరిణామానికి బాలకృష్ణ క్షణకాలం ఆశ్చర్యపోయినప్పటికీ, వెంటనే తేరుకుని ఆమెను "దీర్ఘాయుష్మాన్ భవ" అని ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Nandamuri Balakrishna #Samyuktha #Touches His Feet #Tollywood #ViralVideo
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.